హైదరాబాద్, ఆట ప్రతినిధి: కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన షేక్ నాజియాను.. కళాశాల యాజమాన్యం బుధవారం ఘనంగా సత్కరించింది.
నల్లగొండకు చెందిన నాజియా.. హైదరాబాద్ గన్‌ఫౌండ్రీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివింది. ఇటీవల లండన్‌లో జరిగిన పోటీల్లో రాణించి రెండు కాంస్యాలు నెగ్గింది.