హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన నల్లగొండ జిల్లా సెలెక్షన్ ట్రయల్స్ జరుగనున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి ట్రయల్స్ మొదలవుతాయని హెచ్‌సీఏ నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆరో తరగతి నుంచి పది వరకు నల్లగొండలో చదివిన వారు ఇందుకు అర్హులు. ట్రయల్స్‌కు హాజరయ్యే వారు తమ బర్త్ సర్టిఫికేట్, ఆధార్‌కార్డ్‌తో హాజరుకావాలని హెచ్‌సీఏ సూచించింది.