Monte Carlo Masters | కళ తప్పనున్న మోంటే కార్లో మాస్టర్స్.. వైదొలిగిన నాదల్, అల్కరాజ్
ఈసారి మోంటే కార్లో మాస్టర్స్(Monte Carlo Masters) టోర్నమెంట్ కళ తప్పనుంది. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు టోర్నీకి దూరం కానున్నారు. వరల్డ్ నంబర్ 2 కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz), 13వ ర్యాంకర్ రఫెల్ నాదల్(Rafael Nadal) ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్టు ఈ స్టార్ ప్లేయర్స్ ప్రకటించారు.
Monte Carlo Masters : ఈసారి మోంటే కార్లో మాస్టర్స్(Monte Carlo Masters) టోర్నమెంట్ కళ తప్పనుంది. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు టోర్నీకి దూరం కానున్నారు. వరల్డ్ నంబర్ 2 కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz), 13వ ర్యాంకర్ రఫెల్ నాదల్(Rafael Nadal) ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్టు ఈ స్టార్ ప్లేయర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఏటీపీ ఈరోజు వెల్లడించింది. వచ్చే వారం మోంటే కార్లో మాస్టర్స్ టోర్నమెంట్ మొదలుకానుంది.
‘మోంటే కార్లో మాస్టర్స్ టోర్నీ నా కెరీర్లో చాలా ముఖ్యమైనది. అయితే.. దురదృష్టవశాత్తు ప్రస్తుతం పోటీ పడేందుకు నేను సిద్ధంగా లేను. నేను ఆడేందుకు ఎంతో ఇష్టపడే టోర్నీని మిస్ అవుతున్నాను’ అని నాదల్ ఒక ప్రకటనలో తెలిపాడు.
11 సార్లు విజేత
ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లోనే నాదల్ ఇంటిదారి పట్టాడు. ఆ టోర్నీ సమయంలోనే తొడ కండరాలు సమస్యతో బాధ పడుతున్న నాదల్ ఇంకా కోలుకోలేదు. మట్టి కోట రారాజుగా వెలుగొందిన రఫా 11 సార్లు మోంటే కార్లో ట్రోఫీ నెగ్గాడు. గాయాలతో సతమతమవుతున్న అతను ఈమధ్యే 13వ స్థానానికి పడిపోయాడు. అతను 912 వారాల పాటు పదో ర్యాంకులో ఉండి రికార్డు సృష్టించాడు. వరల్డ్ నంబర్ 2 ప్లేయర్ అల్కరాజ్ను గాయాలు వెంటాడుతున్నాయి. కోలుకున్నతర్వాత మళ్లీ రాకెట్ పట్టిన ఈ యంగ్‌స్టర్ పోయిన వారం మియామి ఓపెన్ సెమీ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు.
ఇవి కూడా చదవండి
IPL 2023 | ఐపీఎల్లో ధోనీ హవా.. లక్నోపై రెండు సిక్సర్ల వీడియోకు 1.7 కోట్ల వ్యూస్
IPL 2023 | పదహారో సీజన్ మొత్తానికి ఆర్సీబీ విధ్వంసక బ్యాటర్ దూరం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

