IPL 2023 | పదహారో సీజన్ మొత్తానికి ఆర్సీబీ విధ్వంసక బ్యాటర్ దూరం
IPL 2023 : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసక బ్యాటర్ రజత్ పాటిదార్(Rajat Patidar) టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఈరోజు వెల్లడించింది. అషిల్లేస్ హీల్ గాయంతో బాధపడుతున్న పాటిదార్ పూర్తిగా కోలుకోలేదు.
IPL 2023 : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసక బ్యాటర్ రజత్ పాటిదార్(Rajat Patidar) టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఈరోజు వెల్లడించింది. అతను తొందరగా కోలుకోవాలని, ఈ కష్టకాలంలో ఫ్రాంచైజీ అతడికి మద్దతుగా ఉంటుందని ట్విట్టర్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాదు అతని ప్లేస్‌లో ఎవరిని ఆడించాలి అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ జట్టు కోచ్, మేనేజ్మెంట్ తెలిపింది. అషిల్లేస్ హీల్ గాయంతో బాధపడుతున్న పాటిదార్ పూర్తిగా కోలుకోలేదు. అతను ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన పాటిదార్ పదిహేనో సీజన్లో చెలరేగాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సెంచరీ బాదాడు. అతను150 స్ట్రైక్ రేటుతో 333 రన్స్ కొట్టాడు. ఇరానీ ట్రోఫీ(Irani Trophy)లోనూ పరుగుల వరద పారించాడు. దాంతో, 16వ సీజన్లో కొన్ని మ్యాచ్‌లైనా ఈ స్టార్ బ్యాటర్ ఆడతాడని ఆర్సీబీ అనుకుంది. కానీ, అతను మొత్తానికే అందుబాటులో లేకపోవడంతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రభావం పడనుంది. తొలి మ్యాచ్‌లో పాటిదార్ బదులు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వెళ్లిన దినేశ్ కార్తిక్ విఫలయమ్యాడు. అందుకని కార్తిక్‌ను తర్వాతి మ్యాచుల్లో ఫినిషర్‌గా పంపాలని ఆర్సీబీ భావిస్తోంది. పాటిదార్ ప్లేస్‌లో..
అంజూ రావత్, మహిపాల్ లొమ్రోర్, సుయాశ్ ప్రభుదేశాయ్లలో ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉంది.
Unfortunately, Rajat Patidar has been ruled out of #IPL2023 due to an Achilles Heel injury. 💔
We wish Rajat a speedy recovery and will continue to support him during the process. 💪
The coaches and management have decided not to name a replacement player for Rajat just yet. 🗒️ pic.twitter.com/c76d2u70SY
— Royal Challengers Bangalore (@RCBTweets) April 4, 2023
విజయంతో ఆరంభం
ఐపీఎల్ 16వ సీజన్ డూప్లెసిస్ సేన విజయంతో ఆరంభించింది. చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ డూప్లెసిస్ (73), విరాట్ కోహ్లీ (82 నాటౌట్) అర్ధ శతకాలతో చెలరేగారు. క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ సిక్సర్‌తో మ్యాచ్ ముగించడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఏప్రిల్ 6న కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఆర్సీబీ ఢీ కొట్టనుంది.
ఇవి కూడా చదవండి
Sanjita Chanu | డోప్ టెస్టులో విఫలమైన వెయిట్ లిఫ్టర్ సంజిత… నాలుగేండ్లపాటు నిషేధం
Dhoni: ఆ సీటుకు ధోనీ పేరు పెడుతున్నాం..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

