MI | కొత్త ఫ్రాంచైజీలకు పేర్లు పెట్టిన ముంబై ఇండియన్స్.. బ్రాండ్ మారకుండా జాగ్రత్తలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందింది ముంబై ఇండియన్స్. ఈ లీగ్లొ మరే జట్టుకు సాధ్యంకాని విధంగా ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ నెగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో సాగుతున్న ముంబై ఇండియన్స్ తాజాగా మరో రెండు దేశాలలో జరుగనున్న టీ20లీగ్‌లలో కూడా అడుగుపెట్టనుంది. యూఏఈతో పాటు దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలుకాబోయే సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లలో ఫ్రాంచైజీలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ముంబై ఇండియన్స్.. ఆ రెండు కొత్త ఫ్రాంచైజీలకు పెట్టిన పేర్లను రివీల్ చేసింది.
యూఏఈ టీ20లీగ్‌లో కొనుగోలు చేసిన జట్టకు ఎంఐ ఎమిరేట్స్ (MI Emirates) అని పేరు పెట్టగా.. సౌతాఫ్రికాలోని జట్టుకు ఎంఐ కేప్‌టౌన్ (MI Cape Town) అని నిర్దారించింది. రెండు ఫ్రాంచైజీలకు రెండు పేర్లు పెట్టినా ఈ రెండింటిలో కామన్‌గా ఉన్నది MI (ముంబై). ఎంఐకి ఉన్న బ్రాండ్ వాల్యూను మరింత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఈ మేరకు ట్విటర్ ద్వారా ఈ పేర్లను ముంబై రివీల్ చేసింది. పేర్లతో పాటు రెండు కొత్త ఫ్రాంచైజీలలో ఆటగాళ్లు ధరించే జెర్సీలు కూడా ముంబై ఇండియన్స్ క్రికెటర్లు ధరించే దుస్తులే దర్శనమివ్వనున్నాయి. నీలి, బంగారు వర్ణంతో మెరిసిపోయే జెర్సీలను ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ కేప్‌టౌన్ ఆటగాళ్లు ధరించనున్నారు.
ముంబైతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్‌జెయింట్స్ సైతం సౌతాఫ్రికాలో ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి. చెన్నై.. జోహన్నస్బర్గ్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయగా దాని పేరును జోబర్గ్ సూపర్‌కింగ్స్ అనే పేరును దాదాపు ఖాయం చేసినట్టు తెలుస్తున్నది.
🚨 Welcoming @MIEmirates & @MICapeTown into our FA𝐌𝐈LY OF TEAMS! 💙
📰 Read more – https://t.co/85uWk804hU#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA
— Mumbai Indians (@mipaltan) August 10, 2022
🆕 𝕋𝔼𝔸𝕄
💙 𝕊𝔸𝕄𝔼 FA𝐌𝐈LY
🇦🇪 @MIEmirates🎨: James Sun#OneFamily #MIemirates @EmiratesCricket pic.twitter.com/bxFM9EzBW7
— Mumbai Indians (@mipaltan) August 10, 2022
𝐌𝐈 represent! Now in 🇿🇦😎
Newest member in our #OneFamily of teams ➡️ @MICapeTown 💪💙
🎨: Alex Chipi#MIcapetown @OfficialCSA pic.twitter.com/3CMOMzdyKH
— Mumbai Indians (@mipaltan) August 10, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

