Mumbai Indians | ‘కంకషన్ సబ్‌స్టిట్యూట్’ దుర్వినియోగం.. ముంబై కోచ్ ఏమన్నారంటే..!
Mumbai Indians : పంతొమ్మిదో సీజన్లో నిరాశపరుస్తున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) మరో వివాదంలో చిక్కుకుంది. వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై కంకషన్ సబ్‌స్టిట్యూట్ (Concussion Substitute) నిబంధనను దుర్వినియోగం చేసిందని పలువురు మండిపడుతున్నారు.
Mumbai Indians : పంతొమ్మిదో సీజన్లో నిరాశపరుస్తున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) మరో వివాదంలో చిక్కుకుంది. వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై కంకషన్ సబ్‌స్టిట్యూట్ (Concussion Substitute) నిబంధనను దుర్వినియోగం చేసిందని పలువురు మండిపడుతున్నారు. గాయపడిన మిచెల్ శాంట్నర్(Michell Santner) స్థానంలో శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)ను ఆడించడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబై ప్రధాన కోచ్ జయవర్ధనే మాత్రం అదేమీ లేదని కొట్టి పారేశాడు.
ఐపీఎల్ నియమావళి ప్రకారం క్రికెటర్ తలకు లేదా మెడకు గాయమైనప్పుడు మాత్రమే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను అనుమతిస్తారు. కానీ, ముంబై ఇండియన్స్ మాత్రం భుజం గాయంతో బాధ పడిన మిచెల్ శాంట్నర్ స్థానంలో శార్ధూల్ ఠాకూర్‌ను ఆడించి విమర్శలకు తావిచ్చింది. కంకషన్ సబ్‌స్టిట్యూట్ నియమాన్ని ముంబై దుర్వినియోగం చేయడంతో ఇదేం క్రీడా స్ఫూర్తి అని మండిపడుతున్నారు. దాంతో.. హెడ్‌కోచ్ మహేళ జయవర్ధనే మాట్లాడుతూ శార్ధూల్‌ను పంపడంపై వివరణ ఇచ్చాడు.
Excellently judged 👌
Mitchell Santner with a fine diving catch in the deep 👏👏
1⃣st wicket of the night for Jasprit Bumrah ☝️
Updates ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @mipaltan pic.twitter.com/5EyRNf9kCb
— IndianPremierLeague (@IPL) April 23, 2026
‘క్యాచ్ అందుకుంటుండగా శాంట్నర్ తల, మెడ నేలకు తాకాయి. భుజం కూడా గట్టిగా తగిలింది. వెంటనే అతడికి స్కాన్ పరీక్షలు నిర్వహించాం. అయితే.. అతడు మగతగా ఉన్నాడు. భుజం మీద ఐస్ ప్యాక్ ఉంచాం. అయినా శాంట్నర్ నిలకడగా లేడు. అందుకని కంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు అనుమతించాలని కోరాం. మ్యాచ్ రిఫరీ, అంపైర్లు శార్దూల్‌ను సబ్‌స్టిట్యూట్‌గా ఆడించేందుకు అంగీకరించారు’ అని జయవర్ధనే తెలిపాడు. కంకషన్ సబ్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన శార్దూల్ 6 పరుగులకే ఔటయ్యాడు. చివరి వికెట్ తీయడంతో ముంబై 104కే ఆలౌటయ్యింది. ఏకపక్ష పోరులో ఘన విజయం సాధించిన చెన్నై ఆరు పాయింట్లతో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
అసలేం జరిగిందంటే..
వాంఖడేలో గురువారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. బుమ్రా ఓవర్లో కార్తిక్ శర్మ గాల్లోకి లేపిన బంతిని ముందుకు డైవ్ చేస్తూ శాట్నర్ అందుకున్నాడు. క్యాచ్ పట్టే సమయంలో అతడి ఎడమ భుజానికి గాయమైంది. నొప్పితో విలవిలలాడిన శాంట్నర్‌ను ఫిజియో, సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు.
What a superb catch by Mitchell Santner to get rid of Kartik Sharma 💪🙌#MitchellSantner #MIvsCSK #IPL2026 #CricketTwitter pic.twitter.com/hgkTHAZw53
— CricketTimes.com (@CricketTimesHQ) April 23, 2026
ఐస్ ప్యాక్‌తో కనిపించిన శాంట్నర్ బ్యాటింగ్ రావడం అసాధ్యమనిపించింది. సంజూ శాంసన్(101 నాటౌట్) సెంచరీతో సీఎస్కే నిర్దేశించిన భారీ ఛేదనలో అకీల్ హొసేన్(4-17), నూర్ అహ్మద్(2-24)ల ధాటికి ముంబై ఓటమి అంచున నిలిచింది. అనూహ్యంగా శార్ధూల్ ఠాకూర్‌ను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బ్యాటింగ్‌కు రావడంతో కామెంటేటర్లు, అభిమానులు సైతం అవాక్కయ్యారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

