మార్గవో: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ మళ్లీ గెలుపు బాట పట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5-1 తేడాతో ఏటీకే మోహన్బగాన్పై ఘన విజయం సాధించింది. ముంబై తరఫున విక్రమ్ ప్రతాప్‌సింగ్(4ని, 25ని) డబుల్ గోల్స్‌తో విజృంభించగా, అంగ్యులో(38ని), ఫాల్(47ని), బిపిన్‌సింగ్(52ని) గోల్స్ చేశారు.