MS Dhoni | పార్టీలో హుక్కా తాగిన ధోనీ .. వైరలవుతున్న వీడియో
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కొత్త ఏడాది సంబురాలను దుబాయ్‌లో చేసుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఫ్రెండ్స్‌తో జరిగిన ఒక పార్టీలో ధోనీ హుక్కా(Hookah) తాగుతూ కెమెరా కంట...
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కొత్త ఏడాది సంబురాలను దుబాయ్‌లో చేసుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఫ్రెండ్స్‌తో జరిగిన ఒక పార్టీలో ధోనీ హుక్కా(Hookah) తాగుతూ కెమెరా కంట పడ్డాడు. మహీ భాయ్ హుక్కా పీలుస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన అభిమానులు ధోనీకి ఈ అలవాటు కూడా ఉందా? అని షాకవుతున్నారు. మరికొందరేమో ‘గతంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బెయిలీ.. ధోనీ స్మోక్ చేస్తాడని చెప్పిన మాట నిజమేనా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు ఆడిన బెయిలీ ఒక ఇంటర్వ్యూలో మహీ భాయ్‌కు హుక్కా తాగడమంటే ఇష్టమని చెప్పాడు.
Smokey start to 2024 MS Dhoni caught on camera smoking Hookah #Dhoni #Thala #MSDhoni pic.twitter.com/KcDWjhGg2B
— Rosy (@rose_k01) January 6, 2024
భారత కెప్టెన్లలో ధోనీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే..? అతడి హయాంలోనే టీమిండియా రికార్డు స్థాయిలో మూడు ఐసీసీ ట్రోఫీ(టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ)లు గెలిచింది. భారత కెప్టెన్‌గా తన ముద్ర వేసిన ధోనీ ఐపీఎల్‌లోనూ సారథిగా అదరగొట్టాడు.

కుర్రాళ్లతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్‌ను 16వ సీజన్లో చాంపియన్‌గా నిలిపాడు. దాంతో, సీఎస్కే ఐదోసారి ట్రోఫీని అందుకుంది. 42 ఏండ్ల ధోనీ 7వ సీజన్లో మరోసారి తన మ్యాజిక్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే.. మోకాలి సర్జరీ నుంచి ఈమధ్యే కోలుకున్న ధోనీ 2024 ఎడిషన్‌లో టోర్నీ మొత్తం ఆడతాడా? కొన్ని మ్యాచ్‌లకే పరిమితమవుతాడా? అనేది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
- Wasim Akram: మీ ఆవిడ చాలా హాట్‌గా ఉందన్న నెటిజన్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన వసీం అక్రమ్
- Boycott Maldives | మాల్దీవులపై భారతీయుల ఆగ్రహం.. ‘బాయ్‌కాట్ మాల్దీవులు’ ట్రెండింగ్..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

