MS Dhoni | ధోనీ కొత్త హెయిర్ స్టైల్.. హీరోలా ఉన్నావ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్.. PHOTOS
MS Dhoni | టీమ్ ఇండియా (Team India) మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఇప్పుడు కొత్త లుక్ (new look)లోకి మారిపోయాడు. హెయిర్ మొత్తం కట్ చేసి యంగ్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు.
MS Dhoni | టీమ్ ఇండియా (Team India) మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేక పరిచం అక్కర్లేదు. తన ఆటతీరుతో పాటు సింప్లిసిటీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇక ధోనీ హెయిర్ స్టైల్ (hairstyle) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ ఎప్పుడూ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో అభిమానుల్ని ఖుషీ చేస్తుంటాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో లాంగ్ హెయిర్‌తో ఉన్న ధోనీ.. ఇప్పుడు కొత్త లుక్ (new look)లోకి మారిపోయాడు.
హెయిర్ మొత్తం కట్ చేసి యంగ్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. కొత్త లుక్‌లో 42 ఏళ్ల ధోనీ 18 ఏళ్ల యువకుడిగా కనిపిస్తున్నాడు. ధోనీ కొత్త లుక్కు సంబంధించిన ఫొటోలను ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకిమ్ (Aalim Hakim) తన ఇన్‌స్టాలో అప్లోడ్ చేశాడు. ‘మన యంగ్ డైనమిక్ అండ్ హ్యాండ్సమ్ మహేంద్ర సింగ్ ధోనీ’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ ‘హీరోలా ఉన్నావ్..’, ‘లుక్ అదిరిపోయింది..’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇంత హెయిర్ మెయిన్‌టెయిన్ చేయడం అంత ఈజీ కాదు..
కాగా, ఇటీవలే ఓ యాడ్ షూట్ కోసం ధోనీ లాంగ్ హెయిర్ పెంచుకున్న విషయం తెలిసిందే. అప్పుడు తన హెయిర్ స్టైల్స్ వల్ల కలిగే ఇబ్బందుల గురించి మిస్టర్ కూల్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారని లాంగ్ హెయిర్ పెంచుకుంటున్నా. అయితే యాడ్స్ షూటింగ్ కోసం రెడీ అవ్వడానికి లాంగ్ హెయిర్ వల్ల ఆలస్యం అవుతోంది. గతంలో 20 నిమిషాల్లో మేకప్ పూర్తి అయ్యేది. కానీ ఇప్పుడు రెడీ అవ్వడానికి గంట అయిదు నిమిషాల నుంచి గంట పది నిమిషాల వరకు సమయం పడుతోంది. మేకప్ కోసం అంతసేపు కుర్చీలో కూర్చొని ఉండటం బోరింగ్‌గా అనిపిస్తోంది. కానీ నా ఫ్యాన్స్ అందరూ హెయిర్ స్టైల్ బాగుందని చెబుతున్నారు. ఇంత హెయిర్ మెయిన్‌టెయిన్ చేయడం అంత ఈజీ కాదు. ఫ్యాన్స్ కోసం మరి కొంతకాలం ఇలానే ఉంచడానికి ప్రయత్నిస్తా. ఏదో ఒక మంచి రోజు చూసి కట్ చేస్తా’ అంటూ చెప్పుకొచ్చారు.
మైదానంలో తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ధోనీ.. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కేవలం ఐపీఎల్ (IPL) సీజన్లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్నారు. ఐపీఎల్ మినమా మిగతా టైమ్‌లో తన విలువైన సమయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం కేటాయిస్తుంటారు. ఇక ధోనీ నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.
Also Read..
Lok Sabha | ఉభయ సభలను కుదిపేస్తోన్న నీట్ అంశం.. లోక్‌సభ సోమవారానికి వాయిదా
IndiGo | విమానం వాష్‌రూమ్‌లో పొగతాగి.. కటకటాలపాలైన ప్రయాణికుడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

