Mohammad Kaif | సూర్య బలహీనతలు అవే.. అందుకే వన్డేల్లో విఫలమవుతున్నాడు : కైఫ్
టీ20ల్లో వరల్డ్ నంబర్ 1 అయిన సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు. అతను విఫలమవ్వడానికి కారణం.. ఆఫ్‌స్టంప్ అవతల పడే బంతుల్ని ఆడడం, కవర్స్ దిశగా షాట్లు ఆడడం అంటున్న మాజీ క్రికెటర్ కైఫ్.
Mohammad Kaif : భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి దిగితే చాలు అతనిపై భారీ అంచానలు ఉంటాయి. టీ20ల్లో విధ్యంసక ప్లేయర్ అయిన సూర్య వన్డేల్లో మాత్రం తేలిపోతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో విఫలమవ్వడానికి కారణం అతని బలహీనతలే అని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అంటున్నాడు. ‘సూర్య టీ20ల్లో అద్భతమైన ఫామ్‌లో ఉన్నాడు. అయితే.. వన్డేల్లో విఫలమవుతున్నాడు. టీ20 ఫామ్‌ను అతను వన్డేల్లో అందుకోవాల్సి ఉంది కైఫ్ అన్నాడు. సూర్య వన్డేల్లో నిరాశపరుస్తున్నాడు. 18 ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్థశతకాలు మాత్రమే సాధించాడు. వరుసగా విఫలమవుతూ అదరినీ నిరాశపరుస్తున్నాడు. ఈ విషయం అతనికి కూడా తెలుసు’ అని కైఫ్ తెలిపాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో సూర్య 26 బంతుల్లో 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఆఫ్ స్టంప్, కవర్స్..
‘అతనొక అద్భుతమైన ప్లేయర్. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే.. టెస్టులు, వన్డేలు, టీ20లు వేటికవే ప్రత్యేకం. ఎవరైనా వన్డేలు, టీ20లు ఒకేరకం అంటే..నేను ఒప్పుకోను. ఎందుకంటే.. వన్డే అనేది సుదీర్ఘ ఆట. అందుకని సూర్య వన్డేపై దృష్టి పెట్టాలి’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు సూర్య అవుట్ కావడానికి కారణం.. ఆఫ్ స్టంప్‌కి అవతల పడే బంతులను ఎదుర్కోవడం సూర్య బలహీనత అని తెలిపాడు. ‘అతను లెగ్ సైడ్ బాగా ఆడతాడు. కానీ తెలివైన బౌలర్ లెగ్ సైడ్ బంతులు వేయడు. వాళ్లు ఆఫ్ సైడ్ బౌలింగ్ చేస్తారు. ఒకవేళ పరుగులు ఇవ్వాలనుకుంటే కవర్స్ దిశగా వెళ్లేలా బంతులు విసురుతారు. కవర్స్‌లో షాట్లు ఆడడంలో సూర్య బలహీనత’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు. తొలి వన్డేలో సూర్య కవర్స్‌లో షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్న అతను వన్డేల్లో మాత్రం రన్స్ బాకీ ఉన్నాడు. దాంతో, అతను భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. రెండో వన్డే రేపు రాయ్‌పూర్‌లో జరగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

