నాకెప్పుడూ అహం లేదు

- వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు
- పొవార్‌తో వివాదాన్ని ఎప్పుడో వదిలేశా: మిథాలీ
న్యూఢిల్లీ: దేశం తరఫున ఆడుతున్నప్పుడు వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావుండదని భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ చెప్పింది. తాను చాలా ఏండ్ల నుంచి ఆడుతున్నానని, ఎప్పుడూ అహం ప్రదర్శించలేదని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. 2018 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో తనతో వివాదం తర్వాత హెడ్‌కోచ్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన రమేశ్ పొవార్ మళ్లీ ఆ స్థానంలో రావడంపై స్పందిస్తూ.. తాను ఆ విషయాన్ని ఎప్పుడో వదిలేశానని, ముందుకు సాగడంపైనే దృష్టి సారిస్తున్నానని మిథాలీ చెప్పింది. ఓ టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరేందుకు ప్రస్తుతం మిథాలీ రాజ్‌తో పాటు భారత జట్టు ముంబైలో క్వారంటైన్లో ఉంది. ‘నేను 21 ఏండ్లుగా ఆడుతూనే ఉన్నా. నాకెప్పుడూ అహం లేదు. నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎన్నో సవాళ్లను అధిగమించా. భారత్ తరఫున ఆడే విషయానికి వస్తే.. దేశానికి సేవ చేస్తున్నప్పుడు వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టాల్సిందే’అని మిథాలీ చెప్పింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

