ఉత్కంఠ పోరులో మరాఠాస్దే విజయం
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను అలరించింది. లీగ్‌లో మూడు విజయాలతో జోరుమీదున్న చేరో ఆర్చర్స్కు మైటీ మరాఠాస్ షాకిచ్చింది. ఇరుజట్ల మధ్య ‘హిట్ ఆర్ మిస్ షూటాఫ్' ద్వారా ఫలితం తేలిన మ్యాచ్‌లో మరాఠాస్.. 2-1తో ఆర్చర్స్‌ను ఓడించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను అలరించింది. లీగ్‌లో మూడు విజయాలతో జోరుమీదున్న చేరో ఆర్చర్స్కు మైటీ మరాఠాస్ షాకిచ్చింది. ఇరుజట్ల మధ్య ‘హిట్ ఆర్ మిస్ షూటాఫ్’ ద్వారా ఫలితం తేలిన మ్యాచ్‌లో మరాఠాస్.. 2-1తో ఆర్చర్స్‌ను ఓడించింది. మొదట ఇరుజట్లూ 4-4 స్కోరు చేయడంతో విజేతను తేల్చేందుకు షూటాఫ్ అవసరమైంది.
షూటాఫ్‌లో ఆంధ్రా ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, అమన్ సైనీ యెల్లో రింగ్‌లో పర్ఫెక్ట్ షాట్లు కొట్టగా చేరో నుంచి ఫులర్టాన్ మాత్రమే సఫలమయ్యాడు. వాస్తవానికి మ్యాచ్‌లో తొలి సెట్ ముగిసేసరికి చేరో ఆర్చర్స్ 2-0తో ఆధిక్యంలో ఉన్నా రెండో సెట్లో రికర్వ్ ఆర్చర్లు ధీరజ్, కుంకుమ్ రాణించి మరాఠాస్‌ను పోటీలోకి తెచ్చారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

