పెర్త్: మిడిలార్డర్ ప్లేయర్లు మార్నస్ లబుషేన్ (204; 20 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవ్ స్మిత్ (200 నాటౌట్; 17 ఫోర్లు) డబుల్ సెంచరీలతో విజృంభించడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 293/2తో గురువారం ఆట కొనసాగించిన ఆసీస్.. 598/4 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ట్రావిస్ హెడ్ (99) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ రెండో రోజు ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది.