MI vs RCB : ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడో వికెట్ పడింది. హేలీ మ్యాథ్యూస్ బిగ్ వికెట్ తీసింది. ఆమె బౌలింగ్‌లో సెటిల్ అయిన రీచా ఘోష్ (28) భారీ షాట్ ఆడి క్యాచ్ ఔట్ అయింది. మేగన్ షట్ (9), శ్రేయాంక పాటిల్ (8) క్రీజులో ఉన్నారు. అంతకుముందు హేలీ ఒకే ఓవర్లో మంధాన (23), హీథర్ నైట్(0)ను ఔట్ చేసి ఆర్సీబీని దెబ్బకొట్టింది. ఓపెనర్ సోఫీ డెవినె (16), దిశా కసాత్(0) ఒకే ఓవర్లో వరుస బంతుల్లో పెవిలియన్ చేరారుఆ జట్టు వెంట వెంటనే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. హుమారియా కర్జీ నేరుగా త్రో చేయడంతో కుదురుకున్న ఎలిసా పెర్రీ (13) రనౌట్‌గా వెనుదరిగింది. దాంతో, 71 రన్స్ వద్ద ఐదో వికెట్ పడింది.