Sarfaraz Ahmed | నా హార్ట్‌బీట్‌ను కొలిస్తే మీటర్ పగిలిపోయేదేమో : పాక్ క్రికెటర్
153 బంతుల్లో 86 రన్స్ చేసిన సర్ఫరాజ్
Sarfaraz Ahmed : పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మళ్లీ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన ఎంపిక సరైనదేనని చాటుతూ మొదటి మ్యాచ్‌లోనే కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మొదటి టెస్టులో అతను 86 పరుగులు చేశాడు. అయితే.. క్రీజులో ఉన్నప్పుడు తన గుండె చాలా వేగంగా కొట్టుకుందని అతను అన్నాడు. ‘నేను మొదటి మూడు బంతులు ఎదుర్కొన్నప్పుడు నా గుండె ఎంతో వేగంగా కొట్టుకుందంటే.. ఆ సమయంలో నా హార్ట్‌బీట్‌ను కొలిస్తే, ఆ మీటర్ పగిలిపోయి ఉండేదేమో’ అని అతను మ్యాచ్ అనంతరం సరదాగా వ్యాఖ్యానించాడు. ‘నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. ఇదేమి నాకు తొలి టెస్టు మ్యాచ్ కాదు. అయినా సరే ఎందుకో చాలా టెన్షన్‌గా అనిపించింది. బాబర్ మాట్లాడడంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. నాకు చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది. నా ఇన్నింగ్స్ జట్టు విజయానికి తోడ్పడుతుందని అనుకుంటున్నా’ అని సర్ఫరాజ్ అన్నాడు.
వికెట్ కీపర్, కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సర్ఫరాజ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. పాక్ క్రికెట్ బోర్డు మహమ్మద్ రిజ్వాన్ స్థానంలో సర్ఫరాజ్‌ను ఎంపిక చేసింది. కెప్టెన్ బాబర్‌తో కలిసి ఐదో వికెట్‌కు 196 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. పాకిస్థాన్ భారీ స్కోర్‌కు బాటలు వేసిన సర్ఫరాజ్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 153 బంతుల్లో 86 రన్స్ చేసిన అతను అజజ్ పటేల్ వేసిన 86వ ఓవర్లో అవుటయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

