అసలంక విజయం

- 5 వికెట్ల తేడాతో బంగ్లా ఓటమి
షార్జా: గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శనతో సూపర్-12కు దూసుకొచ్చిన శ్రీలంక.. ఇక్కడా అదే జోరు కొనసాగించింది. ఆదివారం గ్రూప్-1లో భాగంగా జరిగిన తొలి పోరులో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్ మహమ్మద్ నయీమ్ (62; 6 ఫోర్లు), సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (37 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో చమిక, ఫెర్నాండో, లహిరు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో లంక 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. చరిత అసలంక (49 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో యాంకర్ రోల్ పోషించగా.. భానుక రజపక్స (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టాడు. బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, నసుమ్ అహ్మద్ చెరో వికెట్లు పడగొట్టారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి మంచి జోరు మీదున్న షకీబ్‌ను సరైన సమయంలో బౌలింగ్‌కు దించకుండా.. డెత్ ఓవర్స్ కోసం దాచి ఉంచడం బంగ్లా కొంపముంచింది. ఒంటి చేత్తో లంకను గెలిపించిన చరిత అసలంకకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు: బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 171/4 (నయీమ్ 62, ముష్ఫికర్ 57 నాటౌట్; చమిక 1/12), శ్రీలంక: 18.5 ఓవర్లలో 172/5 (అసలంక 80 నాటౌట్, భానుక 53; షకీబ్ 2/17, నసుమ్ 2/29).
1:టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు (41) పడగొట్టిన బౌలర్‌గా షకీబ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో షకీబ్.. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (39)ని దాటేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

