Ishan Kishan | బహుశా నాపై అతడి బ్యాటింగ్ వీడియోల ప్రభావం పడిందేమో : ఇషాన్ కిషన్
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇషాన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు
Ishan Kishan : ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ భీకరమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బంగ్లా బౌలర్లను ఉతికి ఆరేసిన ఇషాన్ కెరీర్లో తొలి ద్విశతకం సాధించాడు. తన దూకుడు ఆటతీరు వెనక కారణం ఏంటనేది తాజాగా ఈ యంగ్‌స్టర్ వెల్లడించాడు. ‘వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ వీడియోలు ఎక్కువగా చూసేవాడిని. బౌలర్ ఎవరనేది లెక్కచేయకుండా అతడు బంతిని బౌండరీకి తరలించేవాడు. ప్రపంచంలోనే ఉత్తమ బౌలర్లు అయిన బ్రెట్ లీ, షోయబ్ అక్తర్లను కూడా అతను ఉతికి ఆరేశాడు. బహుశా అతని బ్యాటింగ్ హైలైట్స్ వీడియోల ప్రభావం నాపై పడిందేమో’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు. డాషింగ్ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న సెహ్వాగ్, సచిన్‌తో కలిసి భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన తొలి భారత ఆటగాడిగా సెహ్వాగ్ గుర్తింపు సాధించాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇషాన్ డబుల్ సెంచరీ (210 రన్స్)తో చెలరేగాడు. 126 బంతుల్లోనే అతను ద్విశతకం సాధించాడు. దాంతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డును ఇషాన్ బ్రేక్ చేశాడు. క్రిస్ గేల్ 2015లో జింబాబ్వేపై 138 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టాడు. ఐపీఎల్లో ఇషాన్ ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి ఆడుతున్నాడు. పోయిన సీజన్ వేలంలో ముంబై అతడిని అత్యధికంగా రూ.15.25 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆతను పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 370 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ విఫలమైన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

