RCB vs CSK : చిన్నస్వామిలో భారీ ఛేదనకు దిగిన చెన్నైకి భారీ షాక్. 19 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. విధ్వంసక ఆటగాళ్లు డారిల్ మిచెల్(4), రుతురాజ్ గైక్వాడ్(0)లు పెవిలియన్ చేరారు. దయాల్ ఓవర్లో మిచెల్ ఆడిన బంతిని కోహ్లీ అద్భుతంగా క్యాచ్ పట్టాడు.
అంతే.. చెన్నై డగౌట్లో ఆందోళన మొదలైంది. క్రీజులోకి వచ్చిన సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే(6) దంచేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఓపెనర్ రచిన్ రవీంద్ర 10 పరుగులతో ఆడుతున్నాడు. మూడు ఓవర్లకు చెన్నై స్కోర్.. 25/2. ఆ జట్టు విజయానికి ఇంకా 194 రన్స్ కావాలి.
Wicket number 2⃣ in the powerplay!
Virat Kohli & @RCBTweets are charged 🆙
Follow the Match ▶️ https://t.co/7RQR7B2jpC#TATAIPL | #RCBvCSK pic.twitter.com/lXtfANM26b
— IndianPremierLeague (@IPL) May 18, 2024
ప్లే ఆఫ్స్‌లో నిలవాలంటే గెలవక తప్పని పోరులో రాయల్ చాలెంజర్స్ బ్యాటర్లు చితక్కొట్టారు. సొంత ప్రేక్షకుల సమక్షంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఉతికారేశారు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(54) హాఫ్ సెంచరీతో విరుచుకుపడగా.. విరాట్ కోహ్లీ(47) తన బ్యాట్ పవర్ చూపించారు. ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న రజత్ పాటిదార్(41), కామెరూన్ గ్రీన్(38 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో అలరించారు. దాంతో, ఆర్సీబీ నిర్ణీత ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 218రన్స్ కొట్టింది.