బెంగళూరు: ఐపీఎల్ తాజా సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్‌లకు గాను ఆరింటిలో ఓడి ప్లేఆఫ్స్ రేసులో వెనుకబడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో షాక్. ఆ జట్టు స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కొంతకాలం ఐపీఎల్ నుంచి బ్రేక్ తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు. మానసిక, శారీరక అలసట కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అతడు చెప్పాడు.
మ్యాక్సీ మాట్లాడుతూ… ‘ముంబైతో గేమ్‌కు ముందు నేను ఫాఫ్ (డుప్లెసిస్) వద్దకు వెళ్లి నా ప్లేస్‌లో మరెవరినైనా తీసుకోవాలని సూచించా. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవడానికి ఇదే సరైన సమయమని భావించా. త్వరలోనే బలంగా తిరిగొస్తా’ అని అన్నాడు.