దుబాయ్: టీ20 ప్రపంచకప్ టోర్నీని తొలిసారి ముద్దాడిన ఆస్ట్రేలియా క్రికెటర్ల సంతోషం అంతాఇంతా కాదు. ప్రపంచాన్ని జయించిన ఆనందంలో కంగారూలు ఉబ్బితబ్బిబయ్యారు. ఆరు ప్రయత్నాల్లో విఫలమై న్యూజిలాండ్‌పై విజయంతో తమ కల సాకారం చేసుకున్న సంతోషంలో కంగారూలు సంబురాల్లో మునిగి తేలారు. అర్ధరాత్రి వరకు తమ అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తూ ఆసీస్ క్రికెటర్లు తెగ ఎంజాయ్ చేశారు. అయితే తాము ధరించిన షూస్‌లో బీర్ పోసుకుని తాగి డ్యాన్స్‌లు చేశారు. ఆస్ట్రేలియా ఫార్ములావన్ రేసర్ డానియల్ రికియార్డో తీసుకొచ్చిన ‘షూయి’ ట్రెండ్‌ను స్టొయినిస్, వేడ్, ఫించ్.. ఫాలో అయ్యారు. ఈ వీడియోను ఐసీసీ ట్విట్టర్లో షేర్ చేసింది.