Matt Henry: తొలి ఓవర్లోనే షాకిచ్చిన మ్యాట్ హెన్రీ.. రోహిత్, కోహ్లీ, అయ్యర్ డకౌట్
Matt Henry: న్యూజిలాండ్ స్పీడ్ బౌలర్ మ్యాట్ హెన్రీ తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. భారత టాపార్డర్‌లో కీలకమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌లను ఔట్ చేశాడు. ముగ్గురు డకౌట్ అయ్యారు.
మౌంట్ మౌంగనుయి: న్యూజిలాండ్ స్పీడ్ బౌలర్ మ్యాట్ హెన్రీ(Matt Henry) తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. భారత టాపార్డర్‌లో కీలకమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌లను ఔట్ చేశాడు. 334 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు మొదటి ఓవర్లోనే జలక్ తగిలింది. హెన్రీ వేసిన తొలి బంతికే.. రోహిత్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అలెన్ ఆ బంతిని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత మూడు బంతులు ఆడిన కోహ్లీ.. నాలుగో బంతికి క్లీన్ ఔల్డ్ అయ్యాడు. కోహ్లీ కూడా డకౌట్ అయ్యాడు. ఆరో బంతికి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రోహిత్, కోహ్లీ, అయ్యర్.. ముగ్గురూ డౌకట్ అయిన భారత జట్టును పీకల్లోతు కష్టాలో నెట్టారు. మ్యాన్ హెన్రీ తన బౌలింగ్ స్కిల్‌తో తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం ఇండియా ఆరు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 9 రన్స్ చేసింది. క్రీజ్‌లో ఇషాన్, అక్షర్ ఉన్నారు.
క్రికెట్ హిస్టరీలో తొలి ఓవర్లోనే ముగ్గురు బ్యాటర్లు డకౌట్ కావడం ఇదో రెండోసారి. గతంలో శ్రీలంక బౌలర్ చామిండ వాస్ బౌలింగ్‌లో.. తొలి ఓవర్లోనే నలుగురు ప్లేయర్లు ఔటయ్యారు. 2003 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చమిండ వాస్ తొలి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆరో బంతికి మరో వికెట్ తీసి ఆ ఓవర్లో 5 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో తొలి ఓవర్లోనే మూడు లేదా అంతకన్న ఎక్కువ వికెట్లు తీసిన మరో బౌలర్ ఎవరూ లేరు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lungs | ఢిల్లీలో యువత ఊపిరితిత్తులపైనా నల్లని మచ్చలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Itllu Arjuna | అనీష్ ‘ఇట్లు అర్జున’ రివ్యూ.. కొత్త పోరడు హిట్ కొట్టాడా?
Matt Henry: తొలి ఓవర్లోనే షాకిచ్చిన మ్యాట్ హెన్రీ.. రోహిత్, కోహ్లీ, అయ్యర్ డకౌట్
డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
Kalyana Lakshmi | పెండ్లయి పిల్లలు పుట్టాక కల్యాణ లక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

