న్యూయార్క్ : కెన్యాకు చెందిన ఇవాన్స్ చెబెట్, షరాన్ లోకెడి న్యూయార్క్ మారథాన్లో పురుషుల, మహిళల టైటిల్స్ దక్కించుకున్నారు. చెబెట్ 2గం.8ని.41 సెకండ్లలో, లోకెడి 2గం.23ని.23సె.లలో గమ్యాన్ని చేరుకుని విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో షుర కిటాటా(ఇథియోపియా), అబ్ది నగీయె(నెదర్లాండ్స్), మహిళల విభాగంలో చెమ్తై సాల్పెటర్(ఇజ్రాయెల్), గిటిటామ్ గెబ్రసెలాసి(ఇథియోపియా) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.