క్రీడలతో అందమైన జీవితం
పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో కొత్త చరిత్ర లిఖించిన యువ షూటర్ మను భాకర్..తన విజయాన్ని ఆస్వాదిస్తున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్న భాకర్ ఎక్కడికి వెళ్లినా అపూర్వ ఆదరణ దక్కుతున్నది.
- డబుల్ ఒలింపియన్ మను భాకర్
చెన్నై: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో కొత్త చరిత్ర లిఖించిన యువ షూటర్ మను భాకర్..తన విజయాన్ని ఆస్వాదిస్తున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్న భాకర్ ఎక్కడికి వెళ్లినా అపూర్వ ఆదరణ దక్కుతున్నది. మంగళవారం చెన్నైలో వేలామ్మాల్ నెక్సస్ స్కూల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాకర్ ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థులును ఉద్దేశిస్తూ భాకర్ మాట్లాడుతూ ‘టోక్యో ఒలింపిక్స్‌తో నా షూటింగ్ ప్రయాణం మొదలైంది. ప్రపంచ రెండో ర్యాంకర్ షూటర్‌గా పోటీకి దిగిన నేను స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాను.
ఓడిపోవడానికి, గెలువడానికి ఉన్న తేడా ఏంటో నాకు తెలుసు. ఇది క్రీడల్లో ఉన్న అద్భుతం. ఒకసారి ఓడితే మరోసారి గెలువచ్చు. కానీ అదంతా మనం పడే కష్టంపైనే ఆధారపడి ఉంటుంది. క్రీడలను కెరీర్‌గా ఎంచుకోండి. కలలు సాకారం చేసుకోవాలంటే అందుకు బాగా కష్టపడాలి. మనకు కెరీర్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. క్రీడల్లో అద్భుతమైన జీవితం ఉంది. ఆర్థిక మద్దతుతో పాటు అన్ని రకా లు మనం క్రీడల ద్వారా పొందవచ్చు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి నా తల్లే కారణం. ఆమె ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. ఎవరైనా ఏదైనా సాధించాలంటే ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్ల మద్దతు తప్పనిసరిగా కావాలి’ అని అంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

