హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ స్విమ్మింగ్ టోర్నమెంట్లో కె. మనీశ్ గౌడ్ రెండు స్వర్ణాలు, ఓ రజతంతో మెరిశాడు. సెయింట్ జోసెఫ్ కాలేజ్‌కు చెందిన మనీశ్ బుధవారం జరిగిన 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో 1 నిమిషం 29.22 సెకండ్లతో అగ్రస్థానం సాధించాడు.
200 మీటర్ల ఫైనల్లో 3 నిమిషాల 35.61 సెకండ్లతో గోల్డ్ మెడల్ అందుకున్న అతను 50 మీటర్ల పోటీలో రెండో స్థానంలో నిలిచాడు.