DC vs RCB : ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు (Royal Challengers Bangalore) తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ స్మృతి మంధాన (8) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగింది. శిఖా పాండే ఓవర్లో మంధాన గాల్లోకి కొట్టిన బంతి నేరుగా జెమీమా రోడ్రిగ్స్ చేతిలో పడింది. దాంతో, 24 పరుగుల వద్ద ఆ జట్టు మొదటి వికెట్ పడింది. మరో ఓపెనర్ సోఫీ డంక్లెన్ (16), ఎలీసే పెర్రీ (4) క్రీజులో ఉన్నారు. ఐదు ఓవర్లకు వికెట్ నష్టానికి ఆర్సీబీ 28 రన్స్ చేసింది.