శంషాబాద్ రూరల్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ర్టానికి చెందిన మల్లికా రాఘవేందర్ నాలుగు పసిడి పతకాలతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల సీనియర్ 84కిలోల కేటగిరీలో బరిలోకి దిగిన మల్లిక..స్కాట్‌లో 236కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 215.5కిలోలు, బెంచ్‌లో 95కిలోలతో మొత్తంగా 546.5 కిలోలు ఎత్తి సరికొత్త కామన్వెల్త్ రికార్డు నెలకొల్పింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లికి చెందిన మల్లిక ‘స్ట్రాంగెస్ట్ వుమెన్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కూడా దక్కించుకుని ఔరా అనిపించింది.