ఒసాకాకు చుక్కెదురు
ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ నవోమి ఒసాకా (జపాన్)కు షాక్ తగిలింది. తొలి రౌండ్లో అమండా అనిసిమోవా (అమెరికా) చేతిలో ఒసాకా పరాజయం పాలవగా.. స్వియాటెక్, అజరెంక, స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో
నాదల్, స్వియాటెక్ ముందంజ
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్: ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ నవోమి ఒసాకా (జపాన్)కు షాక్ తగిలింది. తొలి రౌండ్లో అమండా అనిసిమోవా (అమెరికా) చేతిలో ఒసాకా పరాజయం పాలవగా.. స్వియాటెక్, అజరెంక, స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఒసాకా 5-7, 4-6తో అనిసిమోవా చేతిలో ఓడింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అనిసిమోవా చేతిలో ఒసాకా తొలి రౌండ్లోనే ఓటమి చెందిన విషయం తెలిసిందే. మరో పోరులో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6-2, 6-0తో లెసియా సురెంకో (ఉక్రెయిన్)ను చిత్తు చేసింది.
సుదీర్ఘంగా సాగిన సమరంలో అజరెంకా బొడ్గాన్పై విజయం సాధించగా.. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రెజ్సికోవా (చెక్ రిపబ్లిక్)కు ఎదురుదెబ్బ తగిలింది. 6-1, 2-6, 3-6తో 19 ఏండ్ల డియానె పారీ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. మొదటి సెట్‌ను కోల్పోయి అనంతరం గొప్పగా పుంజుకున్న ఫ్రెంచ్ ప్లేయర్ పారీ తనదైన ఆటతో రెజ్సికోవాను చిత్తుచేసి సంచలనం సృష్టించింది.
నాదల్ జోరు షురూ..
పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ తొలి పోరులో సునాయాస విజయం సాధించాడు. సోమవారం జరిగిన పోరులో ఐదో సీడ్ నాదల్ 6-2, 6-2, 6-2తో థామ్సన్‌ను చిత్తు చేశాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో నాదల్.. వరుస సెట్లలో విజృంభించాడు. ఒక ఏస్ సంధించిన నాదల్ 7 బ్రేక్ పాయింట్లు ఖతాలో వేసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో దిమిత్రోవ్, కుబ్లెర్, కచనోవ్ ముందంజ వేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

