Lungi Ngidi | టీ20 సిరీస్‌కు ముందే దక్షిణాఫ్రికా పెద్ద షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్
Lungi Ngidi : భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు రోజే ఆతిథ్య దక్షిణాఫ్రికా(South Africa)కు భారీ షాక్ తగిలింది. ఈ మధ్యే ముగిసిన వన్డే వరల్డ్ (ODI World Cup 2023) అదరగొట్టిన స్టార్ పేసర్ లుంగి ఎంగిడి(Lungi Ngidi) గాయం కారణంగా సిరీస్ మొత్తానికి...
Lungi Ngidi : భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు రోజే ఆతిథ్య దక్షిణాఫ్రికా(South Africa)కు భారీ షాక్ తగిలింది. ఈ మధ్యే ముగిసిన వన్డే వరల్డ్ (ODI World Cup 2023) అదరగొట్టిన స్టార్ పేసర్ లుంగి ఎంగిడి(Lungi Ngidi) గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషనల్ సమయంలో 27 ఏండ్ల ఎంగిడి ఎడమ కాలి మడమకు గాయమైంది. అతడు కోలుకునేందుకు రెండు వారాల సమయం పట్టనుంది.
దాంతో, అతడి స్థానంలో సెలెక్టర్లు బురాన్ హెండ్రిక్స్(Beuran Hendricks)ను జట్టులోకి తీసుకుంది. 33 ఏండ్ల హెండ్రిక్స్ 2014లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 19 మ్యాచ్‌లు ఆడిన ఈ పేసర్ 25 వికెట్లు పడగొట్టాడు.
లుంగి ఎంగిడి, బురాన్ హెండ్రిక్స్

దక్షిణాఫ్రికా పేస్ త్రయంలో ఒకడైన ఎంగిడి వన్డే వరల్డ్ కప్‌లో 10 వికెట్లతో రాణించాడు. దాంతో, భారత్‌తో జరిగే మూడు టీ20 సిరీస్‌లో అతడిపై సఫారీ జట్టు భారీ ఆశలే పెట్టుకుంద. దురదృష్టవశాత్తూ ఎంగిడి గాయం కారణంగా పొట్టి సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు కూడా దూరం కావాల్సి వచ్చింది. కీలక బౌలర్ అయిన ఎంగిడి ఆరోగ్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు వైద్యం బృందం పర్యవేక్షించనుంది. రెండు టెస్టుల సిరీస్‌కు ముందు ఎంగిడి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై వైద్యులు ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
- Telangana Assembly | కొలువుదీరిన తెలంగాణ మూడో అసెంబ్లీ
- PM Modi | సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- Mansoor Ali Khan | చిరంజీవి, త్రిషలపై పరువునష్టం దావా వేసిన మన్సూర్ అలీఖాన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

