ముంబై: ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ సత్తాచాటేందుకు సై అంటున్నాయి. అరంగేట్రం సీజన్లోనే గుజరాత్ టైటిల్‌తో మెరిస్తే..లక్నో ప్లేఆఫ్స్ చేరి అంచనాలకు మించి రాణించాయి. మొత్తంగా గత సీజన్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఈ సీజన్లోనూ అదరగొట్టేందుకు లక్నో, గుజరాత్ పట్టుదలతో ఉన్నాయి. కెప్టెన్ రాహుల్ ఫామ్ ఒకింత కలవరపెడుతున్నా..తనదైన రోజైన ప్రత్యర్థి బౌలర్ల దుమ్ముదులుపడంలో ముందుండే రాహుల్ ఒకసారి టచ్‌లోకి వస్తే తిరుగుండకపోవచ్చు.
రాహుల్‌కు తోడు డికాక్, స్టొయినిస్, పూరన్, మార్క్ వుడ్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా జతకలిస్తే లక్నో దశ తిరిగినట్లే. మరోవైపు గుజరాత్ విషయానికొస్తే..కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అంచనాలు లేని జట్టును గత సీజన్లో విజేతగా నిలిపి ఆశ్చర్యపరిచాడు. హార్దిక్‌కు గిల్, విలియమ్సన్, మిల్లర్, తెవాటియా, షమీ తోడైతే టైటాన్స్ మళ్లీ మెరువడం ఖాయమే.