లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ (2) తక్కువ స్కోరుకే పరిమితమవగా.. జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించిన కెప్టెన్ సంజూ శాంసన్ (32)ను హోల్డర్ అవుట్ చేశాడు. హోల్డర్ వేసిన బంతిని లాఫ్టెడ్ డ్రైవ్ ఆడిన శాంసన్.. డీప్ కవర్లో హుడాకు చిక్కాడు. దాంతో శాంసన్ నీరసంగా మైదానం వీడాడు.
లక్నో శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. మరో ఓపెనర్ జైస్వాల్ (39 నాటౌట్) క్రీజులోనే ఉన్నాడు. శాంసన్ అవుటవడంతో మరో లెఫ్ట్ హ్యాండర్ పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు.