లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. గత కొన్ని మ్యాచులుగా తడబడుతున్న జోస్ బట్లర్ (2) ఈసారి కూడా విఫలం అయ్యాడు. ఆవేష్ ఖాన్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆవేష్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన బట్లర్.. పూర్తిగా మిస్ అయ్యాడు.
దాంతో ఆ బాల్ వికెట్లను కూల్చింది. బట్లర్ ఇన్నింగ్స్ ముగిసింది. బట్లర్ అవుటవడంతో కెప్టెన్ సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చాడు. 11 పరుగులకే కీలకమైన బట్లర్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. ఇబ్బందుల్లో పడింది.