గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న క్వింటన్ డీకాక్ (11)ను యువ పేసర్ యష్ దయాళ్ పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలిసారి బంతి అందుకున్న అతను.. మూడో బంతికే డీకాక్‌ను అవుట్ చేశాడు.
అంతకుముందు బంతికి భారీ సిక్సర్ బాదిన డీకాక్.. తర్వాతి బంతిని కూడా బౌండరీ బాదేందుకు ప్రయత్నించాడు. అయితే దాన్ని కొత్త కుర్రాడు సాయి కిషోర్ ముందుకు డైవ్ చేస్తూ అందుకోవడంతో డీకాక్ మైదానం వీడి, నిరాశగా డగౌట్ చేరాడు.