గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టుకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఆ జట్టు ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. డీకాక్ (11) పరుగులకే అవుటవగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ పూర్తిగా నిరాశపరిచాడు. మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న అతను కేవలం 8 పరుగులు మాత్రమే చేసి మైదానం వీడాడు.
మహమ్మద్ షమీ వేసిన ఐదో ఓవర్ ఐదో బంతికి అతను అవుటయ్యాడు. షమీ వేసిన షార్ట్ బాల్‌ను ఆడే ప్రయత్నం చేసిన రాహుల్ విఫలమయ్యాడు. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లో ఎత్తుగా లేచింది. దాన్ని కీపర్ సాహా అందుకోవడంతో రాహుల్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఆ తర్వాతి ఓవర్లోనే కొత్త కుర్రాడు కరణ్ శర్మ (4) కూడా అవుటయ్యాడు. యష్ దయాల్ వేసిన ఓవర్లో అంతకు ముందు బంతిని డ్రైవ్ చేసిన అతను.. ఫీల్డర్ తప్పిదంతో బౌండరీ సాధించాడు. ఆ తర్వాతి బంతిని కూడా ఆఫ్సౌడ్ ఆడేందుకు ప్రయత్నించి స్లిప్స్‌లో ఉన్న వేడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఆ జట్టు మూడు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.