గుజరాత్ టైటాన్స్‌కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న వృద్ధిమాన్ సాహా (6) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. మొహ్సిన్ ఖాన్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి అతను అవుటయ్యాడు. మొహ్సిన్ వేసిన కట్టర్‌ను సరిగా అంచనా వేయలేకపోయిన సాహా..
దాన్ని లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అది లెంగ్త్ బాల్ కావడంతో బ్యాటు పై భాగంలో తగిలి గాల్లోకి లేచింది. బౌలర్ తల మీదుగా గాల్లోకి లేచిన బంతిని ఆవేష్ ఖాన్ అందుకోవడంతో లక్నో జట్టు సంబరాల్లో మునిగిపోయింది.