ఓక్లాండ్ (యూఎస్): మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) నాలుగో సీజన్ టైటిల్‌ను లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ గెలుచుకుంది. ఆదివారం ముగిసిన ఫైనల్లో ఆ జట్టు వాషింగ్టన్ ఫ్రీడమ్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించి ఈ లీగ్‌లో తమ తొలి ట్రోఫీని దక్కించుకుంది. నైట్ రైడర్స్ మొదట 19.4 ఓవర్లకు 164 రన్స్‌కు ఆలౌట్ అయింది. ఛేదనలో పీనార్ (53), ఆండ్రీస్ గౌస్ (40) పోరాడినా వాషింగ్టన్ నిర్ణీత ఓవర్లలో గెలుపునకు ఒక్క పరుగు దూరంలో (163/9) నిలిచిపోయింది.