Ancy Sojan : భారత అథ్లెటిక్స్‌లో మరో రికార్డు బద్ధలైంది. మాజీ లాంగ్ జంపర్ అంజూ బాబీ జార్జ్(Anju Bobby George) రికార్డును కేరళకు చెందిన అన్సీ సోజన్ (Ancy Sojan) బ్రేక్ చేసింది. భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న నేషనల్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో శనివారం అన్సీ ఏకంగా 6.88 మీటర్ల దూరం దూకింది. తద్వారా 22 ఏళ్లుగా అంజూ జార్జ్ పేరిట ఉన్న రికార్డును తన సొంతం చేసుకుందీ కేరళ లాంగ్ జంపర్.
లాంగ్ జంపర్ అన్సీ సోజన్ జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. నేషనల్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ నాలుగో రోజు పోటీల్లో సత్తా చాటిన అన్సీ.. 6.88 మీటర్ల దూరం దూకింది. వెటరన్ లాంగ్ జంపర్ అంజూ బాబీ జార్జ్ పేరుతో ఉన్న 22 ఏళ్ల రికార్డును తన వశం చేసుకుంది.
What just happened???????? 🤯🤩
Ancy Sojan broke the 22 year old National Record with 6.88m Jump in Women’s Long Jump
That’s so crazyyyyyy! 🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/m8HfqJn9Wb
— The Khel India (@TheKhelIndia) June 27, 2026
ఒకప్పుడు స్టార్ లాంగ్ జంపరైన అంజూ జార్జ్ 2004లో 6.83 మీటర్ల దూరం దూకి రికార్డు సాధించింది. ఆ తర్వాత ఆమె దరిదాపుల్లోకి ఎవరూ రాలేదు. కానీ, అన్సీ నేనున్నాను అంటూ అంజూను అధిగమించింది. రికార్డ్ జంప్‌తో సెప్టెంబర్ 19 నుంచి జపాన్‌లో మొదలయ్యే ఆసియా క్రీడలకు అన్సీ అర్హత సాధించింది.