Home
Sports
Local Franchise Kakatiya Knights Finished At The Top Of The Standings In The League Stage Of The Second Season Of The Archery Premier League
కాకతీయకే అగ్రస్థానం
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ లీగ్ దశను లోకల్ ఫ్రాంచైజీ కాకతీయ నైట్స్ అగ్రస్థానంతో ముగించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: శనివారం జరిగిన చివరి లీగ్ పోరులో కాకతీయ 6-0తో మైటీ మరాఠాస్ను చిత్తుగా ఓడించింది. ఈదురుగాలులను సైతం లెక్కచేయకుండా కాకతీయ నైట్స్ అగ్ర కాంపౌండ్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, నికో వీనర్ అద్భుత ప్రదర్శన చేశారు. తమ వంతుగా 60కి 60 పాయింట్లు సాధించి జట్టును గెలిపించారు.
కాకతీయ, మరాఠాస్ ఇప్పటికే టాప్-2 ప్లేస్లతో ప్లేఆఫ్స్ చేరుకోగా.. ఫైనల్ బెర్తు కోసం క్వాలిఫయర్-1లో మరోసారి తలపడతాయి. మరోవైపు తమ చివరి లీగ్ పోరులో 6-0తో డిఫెండింగ్ చాంపియన్ రాజ్పుతానా రాయల్స్ను ఇంటిదారి పట్టించిన పృథ్వీరాజ్ యోధాస్ అనంతరం ఎలిమినేటర్-1మ్యాచ్లో 5-1తో చెరో ఆర్చర్స్ను ఓడించింది. ఆదివారం జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఓడిన జట్టుతో యోధాస్తో రెండో ఎలిమినేటర్లో తలపడనుంది. అనంతరం జరిగే ఫైనల్తో లీగ్ ముగియనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

