ఢిల్లీ: వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్-17కు దూరమైన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. దక్షిణాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్ ఐపీఎల్లో తొలి సీజన్ ఆడనున్నాడు.
మూడేండ్ల క్రితం సఫారీ టీమ్‌లోకి వచ్చిన విలియమ్స్ ఇప్పటి వరకూ రెండు టెస్టులు, మూడు వన్డేలు, 11 టీ20లు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. రూ.50 లక్షల కనీస ధరతో అతడు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సీజన్లో 5 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.