Lionel Messi | మెస్సీ ఫ్రీ-కిక్ తగిలి గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. వీడియో
Lionel Messi : వరల్డ్ కప్ హీరో లియోనల్ మెస్సీ(Lionel Messi) మళ్లీ స్టేడియంలో అభిమానులను అలరిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఫోర్ట్ లాడెర్డేల్ స్టేడియంలో మెస్సీ సారథ్యంలోని ఇంటర్ మియామి 5-0తో గెలుపొందింది. అయితే.. ఈ మ్యాచ్ రెండో అర్థభాగంలో మెస్సీ కొట్టిన...
Lionel Messi : వరల్డ్ కప్ హీరో లియోనల్ మెస్సీ(Lionel Messi) మళ్లీ స్టేడియంలో అభిమానులను అలరిస్తున్నాడు. హాకాంగ్తో మ్యాచ్‌కు దూరమైన ఈ స్టార్ ఫుట్‌బాలర్ ఒర్లాండో సిటీ(orlando city)తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఆదివారం రాత్రి ఫోర్ట్ లాడెర్డేల్ స్టేడియంలో మెస్సీ సారథ్యంలోని ఇంటర్ మియామి 5-0తో గెలుపొందింది. అయితే.. ఈ మ్యాచ్ రెండో అర్థభాగంలో మెస్సీ కొట్టిన ఫ్రీ కిక్(Free Kick) స్టేడియంలోకి దూసుకెళ్లింది.
గోల్ పోస్ట్ మీదుగా వెళ్లి కుర్చీ కూర్చున్న చిన్నారి ముఖానికి తాకింది. దాంతో, అప్పటిదాకా కేరింతలు కొడుతున్న ఆ పాప ఒక్కసారిగా గుక్కపెట్టి ఏడ్చేసింది. ఆమె తల్లిదండ్రులు ఆ పాపను ఓదార్చేందుకు నానా తిప్పలు పడ్డారనుకో.
Messi’s free kick hits a baby in the crowdpic.twitter.com/ZT6DrxQt73
— Troll Football (@TrollFootball) March 3, 2024
ఆమె తండ్రి తనను ఓదార్చుతూ… ‘నువ్వు బాగానే ఉన్నావా.. ఏదీ ఏమైనా మెస్సీ కొట్టిన బంతి నీకు తగిలింది. అందులో ఏమీ పొరపాటు లేదు’ అని అనడం మెస్సీపై అతడికున్న అభిమానానికి అద్దం పడుతోంది. నిరుడు పారిస్ సెయింట్ జర్మనీ (PSG) క్లబ్ నుంచి అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌కు మెస్సీ మారాడు. అతడి రాకతో ఇంటర్ మియామి రాతే మారిపోయిందనుకో. మేజర్ సాకర్ లీగ్‌లో ఆ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్లింది.
లియోనల్ మెస్సీ

అర్జెంటీనాకు మూడో వరల్డ్ కప్ అందించిన మెస్సీ.. హాంకాంగ్‌తో ఫిబ్రవరి 4న జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్లోబరిలోకి దిగలేదు. దాంతో, అతడిని చూసేందుకు స్టేడియానికి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మెస్సీ ఆడకపోవడంతో తమ మ్యాచ్ టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో, చైనాలోని బీజింగ్‌కు చెందిన ఫుట్‌బాల్ సమాఖ్య అర్జెంటీనా జట్టు పర్యనను రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- IPL 2024 | చెన్నైకి మరో షాకింగ్ న్యూస్.. ఐపీఎల్‌కు స్టార్ ఓపెనర్ దూరం
- Kaleshwaram | తెలంగాణ జాతి సంపద కాళేశ్వరం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

