Lionel Messi : అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌లో అరుదైన ఘనత సాధించాడు. అర్జెంటీనా జట్టు తరఫున నాలుగు వరల్డ్ కప్‌లలో గోల్స్ కొట్టిన మొదటి ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు. గ్రూప్ సి లో సౌదీ అరేబియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో మోస్సీ ఒక గోల్ నమోదు చేశాడు. దాంతో, అతను ఈ రికార్డు సాధించాడు. మెస్సీ గతంలో 2006, 2014, 2018 ఫిఫా వరల్డ్ కప్‌లో గోల్స్ సాధించాడు. మెస్సీ కంటే ముందు బ్రెజిల్కె చెందిన పీలే, జర్మనీ ఆటగాళ్లు సీలర్, మిరోస్లవ్ కొస్లే, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ ఫీట్ సాధించారు.
టైటిల్ ఫేవరెట్‌గా ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన అర్జెంటీనాకు తొలి మ్యాచ్‌లోనే షాక్ తగలింది. ఈ మ్యాచ్‌లో 51వ ర్యాంక్‌లో ఉన్న సౌదీ అరేబియా 2-1 గోల్స్‌తో అర్జెంటీనా మీద సంచలన విజయం నమోదు చేసింది.