DC vs GG : గుజరాత్ జెయింట్స్ (Gujarat Gaints) ఓపెనర్ లారా వోల్వార్డ్త్(12) అర్ధ శతకం బాదింది. డబ్ల్యూపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసింది. 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఫిఫ్టీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో విఫలమైన ఆమె కీలక మ్యాచ్‌లో రాణించింది. అష్ గార్డ్నర్ (29)తో కలిసి మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించింది. 17 ఓవర్లకు ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 116 రన్స్ చేసింది. జొనాసెన్ వేసిన 16వ ఓవర్లో వోల్వార్డ్త్ చెలరేగింది. ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదింది. 15 రన్స్ రావడంతో గుజరాత్ స్కోర్ వంద దాటింది.
గుజరాత్ 53 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కుదురుకున్న హర్లీన్ డియోల్ (31) ను జొనాసెన్ వెనక్కి పంపింది. పవర్ ప్లేలో గుజరాత్ జెయింట్స్ వికెట్ నష్టానికి 32 రన్స్ చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డంక్లీ (4) ఔట్ అయింది. మరిజానే కాప్ వేసిన ఆఖరి బంతికి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దాంతో, ఆ జట్టు 4 పరుగులకే కీలకమైన వికెట్ పడింది.