WPL 2024 | ఢిల్లీతో కీలక మ్యాచ్.. యూపీకి ఆఖరి మోక.. ఓడితే అంతే సంగతులు!
WPL 2024, DC vs UP | ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న యూపీ వారియర్స్ నేడు అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే యూపీ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్టే..!
WPL 2024, DC vs UP | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగింపునకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే 14 మ్యాచ్‌లు ముగిసిన లీగ్ దశలో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న యూపీ వారియర్స్ నేడు అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే యూపీ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్టే. ఢిల్లీ గెలిస్తే ప్లేఆఫ్స్‌లో బెర్త్ దక్కించుకున్న తొలి టీమ్ అవనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ కీలక పోరులో యూపీ సారథి అలిస్సా హీలి టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. మెగ్ లానింగ్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
ఈ సీజన్లో యూపీ.. ముంబై, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లలో మాత్రమే నెగ్గి మిగిలిన నాలుగింట్లోనూ ఓడింది. గురువారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆ జట్టు 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. యూపీకి ఇది ఏడో మ్యాచ్ కాగా ఈనెల 11న గుజరాత్ జెయింట్స్‌తో పోటీ పడనుంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న యూపీ.. ప్లేఆఫ్స్ చేరాలంటే నేడు ఢిల్లీని భారీ తేడాతో ఓడిస్తే ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు చేరతాయి. గుజరాత్‌ను కూడా ఓడించాలి.
వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచినా యూపీకి ప్లేఆఫ్స్ అంత వీజీ అయితే కాదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. తర్వాత ఆడబోయే రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. యూపీకి ఆ జట్టు విజయాలతో పాటు ఆర్సీబీ పరాజయాలే ప్లేఆఫ్స్ దశను నిర్దేశిస్తాయి. గత సీజన్లో ఇలాగే ఆటుపోట్ల మధ్య ప్లేఆఫ్స్ చేరిన యూపీ.. ఈ సీజన్లో అలాంటి మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందేమో చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

