Lasith Malinga | ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్గా యార్కర్ కింగ్..!
Lasith Malinga : శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ(Lasith Malinga) మళ్లీ ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫ్రాంచైజీ గూటికి చేరనున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా అతను సేవలందించనున్నాడు. న్యూజిలాండ్ లెజెండ్ షేన్ బాండ్(Shane Bond) స్థానంలో అతను బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే.. ఈ విషయాన్ని ముంబై మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. ఎందుకంటే.. బాండ్ కాంట్రాక్ట్ ఇంకా...
Lasith Malinga : శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ(Lasith Malinga) మళ్లీ ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫ్రాంచైజీ గూటికి చేరనున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా అతను సేవలందించనున్నాడు. న్యూజిలాండ్ లెజెండ్ షేన్ బాండ్(Shane Bond) స్థానంలో అతను బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే.. ఈ విషయాన్ని ముంబై మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. ఎందుకంటే.. బాండ్ కాంట్రాక్ట్ ఇంకా ముగియలేదు. బాండ్ తొమ్మిదేళ్లుగా ముంబై జట్టుతో కొనసాగుతున్నాడు. ఈమధ్యే ముగిసిన సీజన్లో మలింగ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) బౌలింగ్ కోచ్గా ఉన్న విషయం తెలిసిందే.
మలింగకు ముంబై జట్టుతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆ ఫ్రాంచైజీ తరఫున అతను ఏకంగా ఐదు ట్రోఫీలు అందుకున్నాడు. 2013, 2015, 2017, 2019లో ముంబై ఐపీఎల్ విజేతగా నిలిచింది. అంతేకాదు 2011లో చాంపియన్స్ లీగ్ చాంపియన్గా అవతరించింది. ఈ ఫాస్ట్ బౌలర్ 139 మ్యాచ్లు ఆడి 195 వికెట్లు పడగొట్టాడు.
డబుల్ హ్యాట్రిక్ తీశాక మలింగ సంబురం

ఇందులో రెండు డబుల్ హ్యాట్రిక్స్(double hat trick) ఉన్నాయి. పదహారో సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై అనూహ్యంగా ఎలిమినేటర్ 2లో ఇంటిదారి పట్టింది. దాంతో, 2024 సీజన్లో కప్పు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. బౌలింగ్ యూనిట్ను బలంగా మర్చుకోవడం కోసం మలింగను తీసుకుంటున్నట్టు సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

