Kylian Mbappe | ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపే రికార్డుల మోత..!
Kylian Mbappe | ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup-2026) లో ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ (France star striker) కిలియన్ ఎంబాపే (Kylian Mpappe) తన అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఫుట్‌బాల్ చరిత్ర (Football History) లో తనకంటూ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాడు. నిన్న స్వీడన్ (Sweden) తో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో రెండు గోల్స్ (బ్రేస్) సాధించి, ఫ్రాన్స్ జట్టును 3-0 తేడాతో గెలిపించాడు.
Kylian Mbappe : ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup-2026) లో ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ (France star striker) కిలియన్ ఎంబాపే (Kylian Mpappe) తన అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఫుట్‌బాల్ చరిత్ర (Football History) లో తనకంటూ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాడు. నిన్న స్వీడన్ (Sweden) తో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో రెండు గోల్స్ (బ్రేస్) సాధించి, ఫ్రాన్స్ జట్టును 3-0 తేడాతో గెలిపించాడు. ఈ విజయంతో ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. స్వీడన్‌పై రెండు గోల్స్‌తో ఎంబాపే ప్రపంచకప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 18కి పెంచుకున్నాడు. తద్వారా జర్మనీ (Germany) దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్‌ను అధిగమించాడు.
అంతకంటే ముఖ్యంగా వరల్డ్ కప్ నాకౌట్ దశలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఎంబాపే సరికొత్త చరిత్ర సృష్టించాడు. నాకౌట్ మ్యాచుల్లో 10 గోల్స్ కొట్టి.. బ్రెజిల్ దిగ్గజాలు రొనాల్డో నజారియో, లియోనిడాస్ (చెరో 8 గోల్స్) పేరిట ఉన్న రికార్డును ఎంబాపే బద్దలు కొట్టాడు. ఫ్రాన్స్ ఆటగాడు జస్ట్ ఫాంటైన్, బ్రెజిల్ లెజెండ్ పీలే ఈ జాబితాలో 7 గోల్స్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆసక్తికరంగా ప్రపంచకప్ చరిత్రలో ఆల్-టైమ్ టాప్ గోల్ స్కోరర్‌గా ఉన్న లియోనెల్ మెస్సీ (19 గోల్స్) నాకౌట్ మ్యాచుల్లో కేవలం 5 గోల్స్ మాత్రమే చేయగలిగాడు.
ఇక క్రిస్టియానో రొనాల్డో ఖాతాలో ఇప్పటివరకు ఒక్క నాకౌట్ గోల్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ టోర్నమెంట్లో ఎంబాపే ఇప్పటివరకు 6 గోల్స్ చేసి గోల్డెన్ బూట్ రేసులో మెస్సీతో సమానంగా నిలిచాడు. స్వీడన్ పటిష్ఠమైన డిఫెన్స్‌ను ఛేదిస్తూ ఎంబాపే తన అద్భుతమైన వేగాన్ని, ఫినిషింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ప్లేమేకర్ మైఖేల్ ఒలిస్ అందించిన మూడు అద్భుతమైన అసిస్ట్లలో రెండింటిని ఎంబాపే గోల్స్‌గా మలిచాడు.
మ్యాచ్ అనంతరం ఫ్రాన్స్ మేనేజర్ డిడియర్ డెషాంప్స్ మాట్లాడుతూ.. ‘మనం ఫుట్‌బాల్ చరిత్రను ప్రత్యక్షంగా చూస్తున్నాం. కిలియన్ రికార్డుల కోసం కాకుండా ఖాళీ ప్రదేశాల కోసం చూస్తాడు. కానీ అతిపెద్ద వేదికపై నిలకడగా రాణించే అతని సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలుపుతున్నది’ అని ప్రశంసించాడు. ఈ విజయంతో ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించింది. ఈ నెల 4న జరిగే తదుపరి మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్లో జర్మనీకి షాకిచ్చిన పరాగ్వేతో ఫ్రాన్స్ తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

