మిచెల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన కుల్దీప్.. వీడియో
Kuldeep Yadav : కుల్దీప్ తన స్పిన్ బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్ మిచెల్‌కు షాక్ ఇచ్చాడు. ఆఫ్ సైడ్ వేసిన బంతిని టర్న్ చేసి మిచెల్‌ను ఔట్ చేశాడు. డారెల్ ఔటైన ఆ వీడియో చూడాల్సిందే.
లక్నో: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కివీస్ బ్యాటర్ డారెల్ మిచెల్‌ను అతను ఔట్ చేసిన తీరు సూపర్. ఆఫ్ స్టంప్‌కు బయట పడిన బంతి.. సడెన్‌గా షార్ప్ టర్న్ తీసుకుని బ్యాటర్ ఖంగుతినేలా చేసింది. మిడిల్ స్టంప్‌పై ఆ బంతిని మిచెల్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతికి మిచెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పిచ్‌లో భారీ టర్న్ చూసిన మిచెల్ ఆ ఔట్‌తో షాక్ అయ్యాడు. ఆ ఔట్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్టు చేసింది.
How about that for a ball! 👍 👍@imkuldeep18 bowled an absolute beaut to dismiss Daryl Mitchell 👏 👏 #TeamIndia | #INDvNZ | @mastercardindia
Watch 🎥 🔽 pic.twitter.com/EpgXWYC2XE
— BCCI (@BCCI) January 29, 2023
అయితే 100 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా అతికష్టంగా విజయాన్ని సొంతం చేసుకున్నది. సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు కీలక ఇన్నింగ్స్ ఆడారు. మరో బంతి మిగిలి ఉండగానే ఇండియా విక్టరీని తన ఖాతాలో వేసుకున్నది. దీంతో సిరీస్ 1-1 తేడాతో సమంగా నిలిచింది. చివరి ఓవర్లో ఆరు రన్స్ అవసరం కాగా.. అయిదో బంతిని సూర్య బౌండరీగా మలిచి ఉత్కంఠ విజయాన్ని అందించాడు.
ఉదయం కివీస్ స్కోరింగ్‌ను కట్టడి చేయడంలో ఇండియన్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. న్యూజిలాండ్ బ్యాటర్లు క్రమక్రమంగా ఔటయ్యారు. చాహల్, కుల్దీప్, హార్దిక్, దీపిక్, సుందర్‌లు చెరో వికెట్ తీశారు. దీంతో 20 ఓవర్లలో కివీస్ కేవలం 99 రన్స్ మాత్రమే చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

