CSK vs KKR : ఐపీఎల్లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు వేళైంది. వరస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)ను తొలి విజయంతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఢీ కొడుతోంది. చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లోనైనా గెలవాలనేకసితో ఉంది కోల్‌కతా. టాస్ గెలిచిన కెప్టెన్ అజింక్యా రహానే చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న కోల్‌కతా ఈ మ్యాచ్‌ల ఒక మార్పుతో ఆడుతోంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో బోణీ కొట్టిన చెన్నై ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోందని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. గత ఆరు మ్యాచుల్లో ఇరజట్లు మూడేసి విజయాలు సాధించాయి.
కోల్‌కతా తుది జట్టు : అజింక్యా రహానే(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, రఘువంశీ(వికెట్ కీపర్), రొవ్మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి.
ఇంప్యాక్ట్ సబ్స్ – ఫిన్ అలెన్, మనీశ్ పాండే, తేజస్వీ దహియా, టిమ్ సీఫర్ట్, నవ్‌దీప్ సైనీ.
చెన్నై తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, డెవాల్డ్ బ్రెవిస్, ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జన్‌పీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.
ఇంప్యాక్ట్ సబ్స్ – మాథ్యూ షార్ట్, అకీల్ హొసేన్, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, మ్యాట్ హెన్రీ.