Ranchi ODI | శతకంతో రెచ్చిపోయిన కోహ్లీ.. తొలి వన్డేలో సఫారీల ముందు భారీ లక్ష్యం..!
Ranchi ODI : టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ నుంచి తేరుకున్న భారత జట్టు రాంచీ వన్డేలో భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికేస్తూ విరాట్ కోహ్లీ(135) శతకంతో గర్జించగా.. రోహిత్ శర్మ(57) ఉన్నంతసేపు దంచేశాడు.
Ranchi ODI : టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ నుంచి తేరుకున్న భారత జట్టు రాంచీ వన్డేలో భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికేస్తూ విరాట్ కోహ్లీ(135) శతకంతో గర్జించగా.. రోహిత్ శర్మ(57) ఉన్నంతసేపు దంచేశాడు. హిట్‌మ్యాన్ ఔటయ్యాక గేర్ మార్చిన కోహ్లీ సిక్సర్లతో రెచ్చిపోయి 52వ సెంచరీ సాధించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్(60) డెత్ ఓవర్లలో ధనాధన్ ఆడి స్కోర్ 300 దాటించాడు. రవీంద్ర జడేజా(32) కూడా రాణించగా నిర్ణీత ఓవర్లలో టీమిండియా ప్రత్యర్థికి పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది.
రాంచీ వన్డేలో టాస్ ఓడిన టీమిండియా.. టాపార్డర్ మెరుపులతో దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆరంభంలోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(18) వికెట్ కోల్పోయినా.. రోహిత్ శర్మ(57), విరాట్ కోహ్లీ(135: 120 బంతుల్లో 11ఫోర్లు, 7 సిక్సర్లు)లు దంచేశారు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయిన రోకో స్కోర్ బోర్డును ఉరికించారు. సిక్సర్‌తో కోహ్లీ 75వ అర్ధ శతకం సాధించాడు. ఆ కాసేపటికే హిట్‌మ్యాన్ సైతం హాఫ్ సెంచరీ అందుకున్నాడు. చెలరేగి ఆడుతున్న ఈ ద్వయాన్ని మార్కో జాన్సెన్ విడదీసి సఫారీలకు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (8) క్రీజులో కుదురుకొనే లోపే డెవాల్డ్ బ్రెవిస్ స్టన్నింగ్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. దాంతో.. 183 వద్ద టీమిండియా మూడో వికెట్ పడింది.
6⃣, 6⃣, 4⃣ 🔥
🎥 Enjoy some more brilliance from Virat Kohli’s magnificent 135(120) 👏
Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/evy97Jse4k
— BCCI (@BCCI) November 30, 2025
అనూహ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన వాషింగ్టన్ సుందర్(13) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. బార్ట్‌మన్ ఓవర్లో అతడు బాస్చ్ చేతికి చిక్కడంతో నాలుగో వికెట్ కోల్పోయింది భారత్. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడడంతో స్కోర్ నెమ్మదించింది. అయితే.. జాన్సెన్ ఓవర్లో బౌండరీతో 52వ శతకం సాధించిన కోహ్లీ ఆ తర్వాత సుబ్రమణ్యం ఓవర్లో దంచేశాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 21 పిండుకున్న విరాట్ 43వ ఓవర్లో రికెల్టన్ రన్నింగ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. అనంతరం రవీంద్ర జడేజా(32).. రాహుల్(60) ధనాధన్ ఆడి జట్టు స్కోర్ 300 దాటించారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ మెరుపులతో టీమిండియా 350 కొట్టేలా కనిపించింది. కానీ, ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు పడడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

