కరోనాపై పోరులో కోహ్లీ

- రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన విరాట్, అనుష్క
- నిధుల సమీకరణకు ప్రత్యేక కార్యక్రమం
న్యూఢిల్లీ: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య, నటి అనుష్క శర్మ ముందుకొచ్చారు. కరోనా బాధితులకు సాయం చేసేందుకు నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. కెంటో ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజల నుంచి దాదాపు రూ.7 కోట్ల నిధులు సమీకరించనున్నారు. బాధితులకు ఆక్సిజన్ అందించడం, వైద్యులను ఏర్పాటు చేయడం, వ్యాక్సినేషన్‌పై అవగాహన, టెలీ మెడిసన్ సదుపాయాలు సహా మరిన్ని ఏర్పాట్ల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం యాక్ట్ గ్రాంట్స్ అనే సంస్థతో చేతులు కలిపారు. ఏడు రోజుల పాటు ఈ విరాళాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలో వీలైనంత మందికి సాయం చేసేందుకు తాను, అనుష్క ప్రయత్నిస్తామని కోహ్లీ ఈ సందర్భంగా ట్విట్టర్లో తెలిపాడు. అందరం ఐక్యంగా ఉండి, వీలైనంత మంది ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. అలాగే వైరస్ వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి తాను, విరాట్ ఎంతో కలత చెందుతున్నామని అనుష్క చెప్పింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

