ICC Rankings | వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో దిగజారిన కోహ్లీ స్థానం!
ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్‌గా ఒక వెలుగు వెలిగిన కోహ్లీ.. ప్రస్తుతం పేలవ ఫామ్‌తో బాధ పడుతున్నాడు. రెండేళ్లుగా అంతర్జాతీయ సెంచరీ లేక ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో ఇతర దేశాల బ్యాటర్లు రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెల్లడైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ స్థానం దిగజారింది.
అగ్రస్థానంలో ఉండే కోహ్లీని.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ గద్దె దించిన సంగతి తెలిసిందే. గతేడాది బాబర్ నెంబర్ వన్ సీట్ ఆక్రమించాడు. అప్పటి నుంచి రెండో స్థానంలో ఉన్న కోహ్లీని.. మరో పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హక్ ఇంకో మెట్టు కిందకు నెట్టాడు. దీంతో తాజా ఐసీసీ వన్డే ర్యాంకుల్లో కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. తొలి రెండు ర్యాంకుల్లో పాక్ ఆటగాళ్లే ఉండటం గమనార్హం.
కోహ్లీ తర్వాత నాలుగో స్థానంలో టీమిండియా సారధి రోహిత్ శర్మ ఉన్నాడు. ఐదో స్థానంలో క్వింటన్ డీకాక్ కొనసాగుతున్నాడు. బౌలర్ల విషయానికొస్తే.. రెండు స్థానాలు మెరుగైన పాక్ పేసర్ షహీన్ షా అఫ్రిదీ.. నాలుగో స్థానానికి చేరాడు. పాక్ పేసర్ హాజిల్‌వుడ్ ఒక స్థానం మెరుగై రెండో స్థానంలో నిలిచాడు. న్యూజిల్యాండ్ ఎడమ చేతి వాటం పేసర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
🔸Imam-ul-Haq leapfrogs Virat Kohli into top two 🔼
🔸Shaheen Afridi, Josh Hazlewood surge 📈
🔸Zeeshan Maqsood makes all-round gains 💪Lots of movement in the latest @MRFWorldwide ICC Men’s ODI Player Rankings 👉 https://t.co/NICjDWq6YL pic.twitter.com/zQfn9iFitD
— ICC (@ICC) June 15, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

