బెంగుళూరు: ఈ ఏడాది ఐపీఎల్లో.. ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) టాప్ ఫామ్‌లో ఉన్నాడు. తన బ్యాటింగ్ ట్యాలెంట్‌తో ఆకట్టుకుంటున్నాడు. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. కోహ్లీ మాత్రం తన బ్యాటింగ్ స్కిల్‌తో జట్టుకు భారీ స్కోరును అందించాడు. అయితే కోల్‌కతా బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన ఓ సిక్సర్ అందర్నీ షాక్‌లోకి నెట్టేసింది. 24 కోట్ల పెట్టి మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా కొన్న విషయం తెలిసిందే. ఆ జట్టు ప్రధాన బౌలర్ అయిన స్టార్క్‌ను చాలా ఈజీగా కోహ్లీ ఆడేశాడు. గుడ్లెన్ బంతిని ఫ్లిక్ షాట్‌తో సిక్సర్‌గా మలిచాడు. కోహ్లీ ఆ షాట్ ఆడిన తీరుపై కామెంటేటర్లు మెచ్చుకున్నారు. వాట్ ఏ షాట్ .. లుక్ ఎట్ దట్ బాటమ్ హ్యాండ్ అంటూ గవాస్కర్ కామెంట్ చేశాడు. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో చివరకు కోల్‌కతా విజయం సాధించింది.
जादू माने कोहली 🔥🪄#RCBvKKR #IPLonJioCinema #JioCinemaSports #TATAIPL pic.twitter.com/Fxw1W067Gg
— JioCinema (@JioCinema) March 29, 2024